‘ బలగం ‘ అలాంటి వారికి సరైన సమాధానం.. వేణు యెల్దండి కామెంట్స్..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులరిటీ ద‌క్కించుకున్న కమెడియన్సులో వేణు వండర్స్ కూడా ఒకడు. ఈ షో కి ముందే పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. బలగం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు వేణు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు వివరించాయి. కాగా ఇటీవల చెప్పాలని ఉంది కార్యక్రమంలో పాల్గొన్న వేణు త‌న‌కు సంభంధించిన అనుభవాలను, జ్ఞాపకాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు.

Jabardasth Venu | మెగా ఫోన్‌ పట్టిన మరో కమెడియన్‌.. ఇంతకీ సక్సెస్  అవుతాడా..?-Namasthe Telangana

ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. మీరు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు అని అడగగా మాది చాలా పేద కుటుంబం.. మా తల్లిదండ్రులు కూరగాయలు అమ్మేవారు.. కూరగాయలు అమ్మాలంటే ఎన్నో మాటలు చెప్పాలి.. అలా మాటలు చెబుతూనే పెరిగా అందరూ నన్ను వాగుడుకాయ అనేవాళ్ళు. అయితే సాధారణంగా పేద కుటుంబంలో ఉన్న వారికి ఎవరికీ నటించాలని ఆలోచన రాదు. నాకు మొదటినుంచి సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తోనే యాక్టర్ కావాలని అనుకున్న. అది దేవుడిచ్చిన వరంగ నేను ఫీల్ అవుతా అంటూ వివరించాడు.

అలా యాక్టర్ కావాలని ఉద్దేశంతోనే ఇంటి నుంచి వచ్చేసానని చెప్పిన వేణు.. కెరీర్ స్టార్టింగ్ లో నవకాంత్ అనే రచయిత దగ్గర మూడు నెలలు అసిస్టెంట్గా చేశానని.. అక్కడే చిత్రం శ్రీను అసిస్టెంట్ కోసం వెతుకుతున్నారని తెలిసి జాయిన్ అయ్యాను అని చెప్పాడు. రెండు సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి యాక్టర్ అవుతానని చెప్పి బయటకు వచ్చేశానని వివరించాడు. అప్పట్లో సినిమాల్లో అవకాశాలు లేక చేతిలో డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాన‌ని అదే సమయంలో చిత్రాంజలి జర్నలిస్ట్ కొత్తపల్లి శేషు పరిచయం అయ్యారని.. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటూ చెప్పుకొచ్చాడు. వండర్ బాయ్ అని నాకు పేరు పెట్టింది కూడా ఆయనేనని.. జై మూవీ ఆడిషన్స్ కు నా ఫోటో పంపించా షూటింగ్ కి వెళ్లడానికి మంచి దుస్తులు లేకపోతే ఆయన కొనిపెట్టాడు.

Balagam Wallpapers - Wallpaper Cave

మున్న రిలీజ్ అయ్యి ఫేమ్ వచ్చిన తర్వాత కూడా నా ఇంటి అద్దె ఆయనే కట్టాడంటూ వివరించాడు. కొత్తపల్లి శేషు అన్న నా లైఫ్ లో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతూ ఉండేవాడని చెప్పుకొచ్చిన వేణు.. బలగం ఇంత మంచి సక్సెస్ అందుకుంటుందని మీకు ముందే తెలుసా అని అడగగా.. కథ‌ రాసుకున్నప్పుడే నాకు నమ్మకం కలిగిందని.. అది షూటింగ్ టైంలో రుజువైందని వివరించాడు. ఇక ఈ సినిమాలో ఎవరు యాక్టర్స్ కాదని.. ఆ ఊరిలో ఉన్న వారితోనో షూటింగ్ చేయించామని.. షూటింగ్ టైంలో సన్నివేశాలు జరుగుతుంటే చాలామంది ఎమోషనల్ అయ్యారని.. అది చూశాక సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం కుదిరింది అంటూ వివరించాడు.

ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజును ఎలా ఒప్పించారు అని అడగగా.. సాధారణంగా ప్రొడ్యూసర్ కి స్టోరీలైన్‌ చెప్తారు. కానీ బలగం అలాంటిది కాదు డైలాగ్ బై డైలాగ్ ప్రతి డైలాగ్ ను.. అందులోని పాటను కూడా పాడి వినిపించా.. మొత్తం మూడు గంటల పాటు దిల్ రాజు కు కథ వివరించాకా ఆయ‌న ఒప్పుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బలగం సినిమాను రాయడానికి వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్న వేణు ఈ సినిమా క‌మెడియ‌న్.. డైరెక్టర్ గా మారి సినిమా చేయడమేంటి అని అనుకునే వాళ్ళందరికీ మంచి సమాధానం అంటూ వివరించాడు. ప్రస్తుతం వేణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.