నాగార్జున ఇంత పిరికివాడా..? కొడుకుల సేఫ్టీ కోసం అలా చేస్తున్నాడా..?

ఎవరికైనా సరే ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డలు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని .. పిల్లాపాపలతో హ్యాపీగా ఉండాలి అని ఉంటుంది. కొన్నిసార్లు అది జరగకపోవచ్చు . కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే అలాంటి కోరిక తీరకపోవచ్చు. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ లోనే కొట్టుమిట్టాడుతుంది అక్కినేని ఫ్యామిలీ . అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. చాలా చాలా క్రేజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు .

వేలకోట్ల ఆస్తి.. ఎటు చూసినా పని వాళ్ళే ..కాలు కింద పెట్టకపోయినా పని జరిపించుకునే అంత స్తోమత ఉన్న ఫ్యామిలీ అక్కినేని కుటుంబం. అయితే అక్కినేని కుటుంబంలో కోడలు లేకపోవడం బాధాకరం. అమలా కోడలుగా ఉన్నప్పటికీ నాగచైతన్య – అఖిల్ జీవితాలు ఇంకా సెటిల్ కాకపోవడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే . ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాగార్జునకి సైతం ఇప్పుడు ఆ విషయంలో బెంగ పట్టుకుందట. అందుకే కొడుకుల జీవితం సెటిల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారట . ఇన్నాళ్లు అక్కినేని ట్యాగ్ను ఉపయోగించుకోకూడదు అని చెప్పిన నాగార్జుననే… అక్కినేని ట్యాగ్ ని ఉపయోగిస్తూ బడా డైరెక్టర్స్ ను లైన్లో పెడుతున్నారట.

అఖిల్ నాగచైతన్యలు లైఫ్ లో సెటిల్ అయితే సగం బాధ్యత తీరిపోతుంది అంటూ ఆలోచిస్తున్నారట . ఆ కారణంగానే అఖిల్ కు బడా డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా అవకాశాల కోసం బాగా కష్టపడుతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఎప్పుడు కూడా స్టేటస్ ని నమ్ముకొని నాగార్జున ఫస్ట్ టైం కొడుకుల విషయంలో కొడుకులు సేఫ్టీ గా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ఒక మెట్టు దిగి వద్దు అనుకున్న పనిని చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!