ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్‌ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో పాన్ ఇండియా మూవీ నటించాలని భావిస్తున్నాడట.

Allu Arjun, Trivikram Srinivas reunite for fourth film - The Hindu

అల్లు అర్జున్ వేరే డైరెక్టర్‌ను చూజ్ చేసుకోవడంతో.. త్రివిక్రమ్ కూడా వేరే హీరోని లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ ప్లేస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో బిజీగా ఉన్నాడు చ‌ర‌ణ్. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మ‌రో మూవీ రూపొందుతుంది. ఇక ఈ సినిమా కూడా పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు చరణ్ బిజీ లైన‌ప్‌లో త్రివిక్రమ్ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది.

Ram Charan's Condition To Do A Remake In Future!

త్రివిక్రమ్ తో చరణ ఇదివరకే పనిచేయాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు చరణ్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్సయిందని టాక్. ఇక ఈ ఇద్దరి కాంబో సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న చరణ్ ముందు ముందు మరినీ భారీ సినిమాల టార్గెట్ ను ఎంచుకున్నాడు. తప్పకుండా త్రివిక్రమ్ తో చరణ్ కలిసి సినిమా చేస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.