పోయింది ..అంతా అయిపోయింది.. ఇన్నాళ్లు సుమ కాపాడుకున్న పరువు మొత్తం ఊడ్చుకుని పోయింది..ఏమైందంటే..?

సుమ .. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా తన స్థానాన్ని ముందుకు తీసుకెళ్తుంది . హెల్దీ పంచెస్ వేయడం ..ఫ్యామిలీ షోస్ చేయడం.. యువతను సైతం అట్రాక్టివ్ చేసే పదాలను చాలా హెల్దిగా పలికించడంలో సుమనే ముందు .. ఆ తర్వాతే ఎవరైనా అది అందరూ చెప్పేదే . అయితే రీసెంట్గా సుమ పరువు పోయింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం చేసిన ఓ సంస్ధ చేసిన సర్వే .

ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానాలు మారుతూ ఉంటాయి . కానీ యాంకర్ స్థానం మాత్రం ఎప్పుడూ సుమకే దక్కుతూ వచ్చింది. రీసెంట్గా ఆర్మ్యాక్స్ సంస్థ చేసిన సర్వేలో యాంకర్ సుమ క్రేజ్ మొత్తం డమాల్ అయిపోయింది . ఆమె నాలుగవ స్థానం దక్కించుకునింది. దీనితో సోషల్ మీడియాలో సుమ పేరు వైరల్ గా మారింది . యాంకర్ సుమ క్రేజీ పాపులారిటీ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తాజా సర్వేలో ర్యాంకింగ్ పడిపోయింది .

ప్రముఖ సంస్థ ఆర్ మాక్స్ మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది . ఎప్పుడు నెంబర్ వన్ స్థానంలో నిలిచే సుమ ఈసారి మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది . మొదటి స్థానంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు .. రెండవ స్థానంలో సుడిగాలి సుధీర్.. మూడవ స్థానంలో హైపర్ ఆది ..నాల్గవ స్థానంలో సుమ.. ఐదవ స్థానంలో చమ్మక్ చంద్ర నిలిచారు. దీంతో సుమ క్రేజ్ డమాల్ అని పడిపోయింది అంటూ కొందరు వ్యంగంగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొందరు ఆమె ఈ మధ్యకాలంలో యూట్యూబ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని.. షోస్ పై కాన్సన్ట్రేషన్ తగ్గించేసింది అని కామెంట్స్ చేస్తున్నారు..!!