“యస్..వైరల్ అవుతున్న ఆ వార్త నిజమే”.. ఎన్టీఆర్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే న్యూస్ ఇది..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది బాగా ట్రెండ్ గా మారిపోయింది . మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఒక స్టార్ హీరోకి మరొక స్టార్ హీరో సపోర్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. గతంలో ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో లేవు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . జనాలు కూడా అలాంటి సినిమాలను లైక్ చేయడంతో మేకర్స్ కూడా అలాంటి క్రేజీ క్రేజీ కాంబోలో తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు . తాజాగా అలాంటి ఓ క్రేజీ కాంబో సెలెక్ట్ అయినట్లు రైటర్ మాటల ద్వారా తెలుస్తుంది . ప్రజెంట్ ప్రభాస్ నటిస్తున్న సినిమా “కల్కి”. ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

రీసెంట్గా ఈ సినిమా ఫ్రీ లాన్స్ రైటర్ కేశవ చంద్ర అభిమానులతో ముచ్చటించారు . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయే న్యూస్ చెప్పకనే చెప్పేసాడు . “కల్కిలో ఎన్టీఆర్ కేమియో రోల్లో నటిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నిజమేనా..?” అంటూ ప్రశ్నించారు ఓ నెటిజన్. అయితే దానికి చాలా ఎక్సలెంట్ గా ఆన్సర్ ఇచ్చాడు ఈ రైటర్ . “మీరు ఆ విషయాన్ని సినిమా చూసే తెలుసుకోండి “అంటూ చెప్పారు. ఒకవేళ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించక పోయి ఉంటే కచ్చితంగా నో అంటూ ఆన్సర్ ధీమాగా వచ్చేది . ఆయన నో చెప్పకపోవడంతో ఎస్ అని అంటున్నారు అభిమానులు .

ఈ సందర్భంగా ప్రభాస్ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు రోమాలు నిక్కబడుచుకునేలా ఎన్టీఆర్ రోల్ ఈ సినిమాలో ఉండబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు . ఈ సినిమా పూర్తి మైథాలజికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కకబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఆ విషయాన్ని కన్ఫామ్ చేసేసాడు రైటర్ . “విష్ణుమూర్తి అవతారమే కల్కి ..విష్ణు పదో అవతారమే కల్కి.. అలాంటప్పుడు విష్ణుమూర్తి ప్రస్తావన లేకుండా ఎలా ఉంటుంది..?” అని తెలిపారు . ఈ ఒక్క కన్ఫర్మేషన్ తో సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఆ వైరల్ అవుతున్న వార్తలు నిజమే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!