చిరంజీవి గారి విశ్వంభరా మూవీలో స్పెషల్ సాంగ్ ఉంది.. వశిష్ట సంచలన వ్యాఖ్యలు..!

మన టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ దక్కించుకున్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన చిరు ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకురానున్నట్లు సమాచారం. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనేది డైరెక్టర్లు నోరు విప్పితేనే కానీ తెలియదు. ఇక గత కొంతకాలంగా ఊర్వశి తో ఈ స్పెషల్ సాంగ్ నిర్వహించనున్నట్లు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం చిరు మరియు త్రిష పై కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ట పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో చిరుని ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలానే ఉంటుందని మరియు దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉండనున్నట్లు వశిష్ట్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా ఉండనున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.