కొత్త లుక్ లో దర్శనమిచ్చిన మోక్షజ్ఞ.. తండ్రిని మించిపోయాడు గా..!

నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మనందరికీ సుపరిచితమే. తన ఖాతాలో ఎన్నో హ్యాట్రిక్ హిట్లను వేసుకున్న బాలయ్య తన కొడుకు సినీ కెరీర్ కూడా ఎంతో గ్రాండ్గా ఏర్పరచాలని ఎదురుచూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉండబోతున్నట్లు అనేక ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తన కొడుకు సినిమా కోసం బాలయ్యే స్వయంగా కథను రాస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ప్రస్తుతం చాలా ఫిట్ గా తయారయి తన గ్లామర్ ని మరింత పెంచాడు.

ప్రస్తుతం వైజాగ్లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూసి నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తండ్రిని మించిపోయేటట్లు ఉన్నాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.