రౌడీపై వీడియో చేసిన అమ్మాయిలు.. ఆ పని చేస్తే మీటవుతా అంటూ రిప్లై..!

మన టాలీవుడ్ లో రౌడి హీరోగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకునే విజయ్ గ తేడాది ఖుషి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు పొందాడు.

ఇక విజయ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా బెంగళూరుకి చెందిన ఇద్దరు విద్యార్థులు విజయ్ పై చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హర్షితా రెడ్డి అనే స్టూడెంట్ తన స్నేహితురాలితో కలిసి..” విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే మనం ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతాం ” అని ఓ రీల్ సృష్టించింది.

ఈ రీల్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ రీల్ ని వీక్షించిన విజయ్ రెస్పాండ్ అయ్యాడు. ” మీరు 90% మార్కులు తెచ్చుకోండి. కచ్చితంగా నేను మిమ్మల్ని మీట్ అవుతాను ” అని వారికి ఉత్సాహాన్ని ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Harshitha reddy (@harshithaareddy__)