షాకింగ్: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ తో ఆ మెగా హీరోకు అలాంటి బంధం ఉందా.. ?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది ప్రియాంక. ఈ సీజన్ ద్వారా తన అందం, మాటలతో ప్రజలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ అంతకుమించిన మంచి మనసు చూపించి.. లక్షల మంది అభిమానులను దక్కించుకుంది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘాటు అందాలతో కుర్రాళ‌కు హాట్‌ ట్రీట్ ఇస్తున్న ఈ బ్యూటీ.. వీటి కారణంగా పలు ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది ఈ క్యూట్ బ్యూటీ. ఇక ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గాడ్ ఫాదర్ ఎవరో చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకీ తన గాడ్ ఫాదర్ ఎవరో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆయన ఎవరు.. ఆయనను గాడ్ ఫాదర్‌ల ప్రియాంక ఎందుకు అభిమానిస్తుందో చూద్దాం. ప్రియాంక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా ప‌లు స్కిట్లలో సందడి చేసింది.

జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ అమ్మాయిగా మారడానికి ఎంత ఖర్చు చేసిందంటే.. –  News18 తెలుగు

ట్రాన్స్ జెండర్ అబ్బాయిగా ఉండగానే జబర్దస్త్ షోలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సర్జరీ చేయించుకుని పూర్తిగా అమ్మాయిగా మారిపోయింది. నాలుగేళ్ల పాటు జబర్దస్త్ షో చేస్తూనే పలు ఈవెంట్లలో పాల్గొంటూ కొంత డబ్బులు పోగేసుకుంది. తన చెల్లి పెళ్లి చేయడం, తండ్రి రిటైర్మెంట్ అయిపోగానే తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అలా అమ్మాయిగా వేషాలు వేస్తూ తన జీవితాన్ని కొనసాగించలేనని సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిపోవాలని డిసైడ్ అయింది. అన్ని బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత ఇంట్లో ఎవరితో చెప్పకుండా తను మరో స్నేహితుడితో కలిసి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న ఈ బ్యూటీ తన డబ్బు మొత్తం ఖర్చైపోవ‌డంతో హైదరాబాద్ వచ్చి ఉండేందుకు కూడా డబ్బులు లేక నానా అవస్థలు పడింద‌ట‌.. ఆ సర్జరీ తర్వాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తో ఏడాది పాటు మంచానికే పరిమితమయానంటూ వివ‌రించింది.

Bigg Boss 5 Telugu: Naga Babu to support Priyanka Singh

ఈ టైంలో తన పరిస్థితి తెలుసుకున్న మెగా హీరో నాగబాబు గారు పింకీ కి ఎంతో సహాయం చేశారని.. తను ఏ పని చేయకపోయినా నాగబాబు నెలనెలా పింకీ కి సరిపోయేంత డబ్బు పంపించారని.. తన బట్టలకు, హాస్పటల్కి, మందులకు ఇలా అన్నింటికీ ఆయనే చూసుకున్నారంటూ వివరించింది. జబర్దస్త్ షోలో ఉండగా ఏర్పడిన పరిచయంతోనే ఆయన తనకు అంత సహాయం చేశారని.. ఆయన తన గాడ్ ఫాదర్ అంటూ వివరించింది. కాకపోతే ప్రస్తుతం ఆమె చాలా సంతోషంగా ఉన్నానని ఇక‌ పై కూడా అలాగే హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నిస్తాను అంటూ వివరించింది. భవిష్యత్తులో పెళ్లి లాంటి విషయాల జోలికి కూడా ఆమె వెళ్ళన‌ని తెల్చి చెప్పేస్తుంది. తను ఓ అబ్బాయిని ప్రేమించానని.. అతడు బ్రేకప్ చేయడంతో ఆ బాధను అనుభవించాలని అలాంటి బాధ జీవితంలో మరోసారి ఎప్పుడూ అనుభవించాలనుకోవడం లేదంటూ వివరించింది.