బిగ్ బ్రేకింగ్: “కల్కి” సెట్స్ నుంచి ఎక్స్క్లూజివ్ వీడియో లీక్.. సగం సినిమా బయటకు వచ్చేసింది కదరా నాయనా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏఅడి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఈ సినిమా బాహుబలికి మించిన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అని ప్రభాస్ చరిత్రను తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం మే ఆఖరి వారంలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది . అందుకే షూటింగ్ పనులను చకచగా పూర్తి చేసేస్తుంది చిత్ర బృందం . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి. ఆ వీడియోలో కల్కి మూవీ సెట్స్ కి సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి .

ప్రస్తుతం ఆ వీడియోకి చెందిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో బడా సినిమాలకు సంబంధించిన సీన్స్ ఎలా రిలీజ్ కి ముందే లీక్ అయిపోతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా లీక్ అయిన పిక్స్ చూస్తుంటే సినిమా గూస్ బంప్స్ మోత మోగించేలానే ఉంది . నాగ్ అశ్వీన్ గట్టిగానే ప్లాన్ చేశాడు . హాలీవుడ్ వాళ్ళకి కూడా చెమటలు పట్టించే రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అంటూ తాజాగా లీక్ అయిన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే లీకైన పిక్స్ ఆధారంగా సినిమా కాన్సెప్ట్ ని కనిపెట్టేస్తున్నారు అభిమానులు. దీంతో సినిమాకి భారీ బొక్క పడడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు..!!