సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ద‌ళ‌ప‌తి విజయ్.. నటించే ఆఖరి సినిమా అదేనా..?

సినీ ఇండస్ట్రీస్ సెలబ్రెటీస్‌గా దూసుకుపోతున్న నటీనటులు ఇప్పటికే చాలామందికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. కొంతమంది సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కొంతమంది సినిమాల్లో రాణిస్తూనే పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు దళపతి విజయ్ కూడా ఇదే మార్గంలో నడవనన్నాడు. తాజాగా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక రాజకీయాలకి వెళ్ళిన త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్తాడంటూ తెలుస్తేంది.

Vijay holds meeting with fans association office-bearers; says he will quit  films if he enters politics: report | Tamil News - The Indian Express

కాగా విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తరువాత సినిమానే విజ‌య్ చివ‌రి మూవీ అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే విజయ్ మాత్రం తన 68వ సినిమా గోట్ తర్వాత మరో స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నారంటూ సమాచారం అందుతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో తన 68వ సినిమాకు విజయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందాయి. ఈ నేపథ్యంలో తన చివ‌రి సినిమాకు కూడా విజయ అట్లీకే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ హీరోగా నటించే ఆఖరి సినిమా కూడా ఇదే కానున్నట్లు తెలుస్తుంది.

Vijay-Atlee's third outing to soon go on floor

ఈ సినిమా తర్వాత విజయ్ పలు సినిమాల్లో గెస్ట్ రోల్ లో నటించి సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో బిజీ అయిపోతాడ‌ట‌. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చాలామంది కోలీవుడ్ నటులు అడుగుపెట్టి రాణిస్తున్నారు. తాజాగా విజయ్ ఈ లిస్ట్‌లో చేరాడు. కాగా గతంలో త‌లైవర్ రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే తర్వాత ఆయన ఆలోచనలను విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయంలో అడుగుపెట్టి సినీ రంగంలోనూ రాజకీయంలోనూ బిజీగా గడుతున్నాడు. విజయ్ ఈ రెండిట్లో ఏ దారిని ఎంచుకుంటాడు వేచి చూడాలి.