గుర్తు పట్టలేకుండా మారిపోయిన రవితేజ గాడి గార్ల్ ఫ్రెండ్.. అమ్మ బాబోయ్..ఈ రేంజ్ లో షాక్ ఇచ్చింది ఏంటి..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పటి హీరోయిన్స్ కి సంబంధించిన ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏ లేసిన హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు..? అంటూ పలువురు జనాలు వాళ్ల గురించి ఆరా తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం బాగా చూస్తున్నాం. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది గోపిక . నా ఆటోగ్రాఫ్ సినిమా చూసిన వాళ్లకు లతిక పాత్రలో బాగా గుర్తుండిపోయే ఉంటుంది . మోడల్గా కెరియర్ను ప్రారంభించిన గోపిక ..”ప్రణయమని ధూవల్” అనే మలయాళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది .

మలయాళం లో సూపర్ స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేసింది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది . మరీ ముఖ్యంగా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో లతిక పాత్రలో ఆమె నటించిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేసింది . ఇప్పటికి రవితేజ గాడి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొస్తూ ఉంటారు . అంతలా ఆ పాత్రలో లీనమైపోయినటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన గోపిక .. రీసెంట్గా ఫ్యామిలీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

2008లో ఉత్తర ఐర్లాండ్ లో పనిచేస్తున్న డాక్టర్ అజయ్ చాకోతో గోపికకు పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప ఒక బాబు . ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది . చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే అప్పుడు చాలా బొద్దుగా అనిపించే గోపిక ఇప్పుడు చాలా స్లిమ్ గా మారి ఇంకా ఆకర్షణీయంగా తయారయింది. ఈమెను చూస్తే అమ్మ కాదు అమ్మాయి అనే అనుకుంటారు . అంతలా బాడీ ఫిజిక్ను మైంటైన్ చేస్తుంది..!