యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాత‌రే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న‌ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పొచ్చు.

దసరా పండుగ కి దేవ‌ర సినిమా బాక్సాఫీస్ బ‌రిలో దిగడం అంటే కచ్చితంగా హిట్ కొట్టడం ఖాయం అంటూ.. దేవర బాక్స్ ఆఫీస్‌ను షేక్‌ చేయడం పక్క అంటూ మాస్ జాత‌ర మొద‌లౌతుందంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి రిలీజ్ డేట్ మార్చే ప్రసక్తే లేదని సినిమాను ఎట్టి పరిస్థితిలో దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ డిజిట‌ల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఆ లెక్కలలో ఎటువంటి మార్పులు రాకుండా రిలీజ్ డేట్ దీనికి అనుకూలంగా ప్లాన్ చేశారట. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా న‌టిస్తుంది.

Jr NTR's 'Devara Part 1' release date out, makers announce with new poster  - India Today

ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో నటించినా ఆమెకు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. దీంతో తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ సినిమాతో జాన్వి కపూర్ ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తుంది. అలాగే ఎన్టీఆర్‌కు కూడా ఈ సినిమా ఎంతో కీలకం. తన సొంత బ్యానర్ లో ఈ సినిమాకు ఓ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. దీంతో సినిమాపై కసిగా పనిచేస్తున్న తారక్ ద‌స‌రాకి రిలీజ్ అయ్యే ఈ మూవీతో ఊహించిన రేంజ్ లో హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.