ఇక్కడ అడ్డుపడితే హాలీవుడ్‌లో సినిమాలు తీస్తా.. సినిమాలు తీయ‌టం ఆప‌ను.. సందీప్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ప్రస్తుతం మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన యానిమల్ సినిమా బాలీవుడ్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. హార్డ్ టైంలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ రూ.800 కోట్ల కలెక్షన్లను కళ్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఇక సందీప్ రెడ్డి ఏ సినిమాను తెరకెక్కించిన ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మరింత బోల్డ్‌గా, ఆరోగెన్సి, యాటిట్యూడ్ తో హీరోను ఎలివేట్ చేస్తాడు. ఆ రేంజ్ లో ఇప్పటివరకు ఏ దర్శకుడు హీరోను చూపించలేదు. గతంలో పూరి జగన్నాథ్‌ హీరోని యాటిట్యూడ్ తో చూపించేవారు. అయితే ఇప్పుడు ఆయనను మించిపోయి సందీప్ రెడ్డి హీరోలను బోల్డ్‌గా చూపిస్తున్నాడు.

Animal (2023) - IMDb

కాగా యానిమల్ సినిమా రికార్డ్ తో పాటు.. గతంలో సందీప్ రెడ్డివంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే సందీప్‌ రెడ్డి వంగ మాట్లాడుతూ నా సినిమాను ఎక్కడ ఆపేస్తే హాలీవుడ్‌లో తీస్తాను నన్నెవరూ ఆపలేరంటూ కామెంట్స్ చేశారు. ఇక‌ సందీప్ రెడ్డి అలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఏ సందర్భంలో చేశారో ఒకసారి చూద్దాం. సందీప్ రెడ్డి మొదటి సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాండే హీరోయిన్గా నటించారు. ఈ సినిమా చాలా బాగుండగా.. హీరో క్యారెక్టరైజేష‌న్‌, యాటిట్యూడ్‌తో లిప్ కిస్‌లు, హగ్గ్‌లతో, బోల్డ్ డైలాగ్ లతో తెరకెక్కింది. ఆ సమయంలో కొన్ని థియేటర్ల‌ వద్ద సినిమాను ఆపేయాలంటూ మహిళా సంఘాలు గోల చేశాయి.

100+] Arjun Reddy Wallpapers | Wallpapers.com

అప్పుడు ఓ మీడియా ఛానల్ లైవ్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగకు ఇంటర్వ్యూవర్ ఆ విషయాన్ని చెప్పి.. ఇప్పుడు సినిమాను ఆపేయడం మీ నెక్స్ట్ సినిమాకు ఎఫెక్ట్ అవుతుందా.. ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకుంటున్నారు అని అడగగా.. నా సినిమాను ఇక్కడ ఆపేస్తున్నారా.. అయితే నేను తమిళ్, హిందీ, కన్నడ, భోజ్‌పూరి, మలయాళ భాషల్లో తెర‌కెక్కిస్తా. మన దేశంలోనే సినిమాలు ఆపేస్తే.. హాలీవుడ్‌లో సినిమాలు తీస్తా.. అంతేకానీ నేను సినిమాలు మాత్రం ఆపే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఇక సందీప్ రెడ్డి సినిమా డైలాగ్స్ కంటే.. ఆయన ఇంటర్వ్యూలో చేప్పిన ఈ డైలాగ్స్ యూత్ కు పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ నెటింట తెగ వైరల్ చేస్తున్నారు.