రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు బాలీవుడ్ లో కూడా భారీ పాపులర్ టీ ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ అందుకుని గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. అంతకుముందు కూడా బాలీవుడ్ లో జంజీర్ సినిమాలో నటించాడు. ఆ సినిమాను ఆయన డైరెక్ట్ కూడా చేశాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో మరో బాలీవుడ్ సినిమాలో చరణ్ నటించలేదు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన ఓ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.

Ram Charan says filming Yentamma with Salman Khan was, “Little boy's dream that came true” | Filmfare.com

మెగా ఫ్యామిలీకి బాలీవుడ్ స్టార్స్ తో మంచి బంధం ఉంటుంది. సల్మాన్ ఖాన్ మూవీలో చరణ్ కనిపించడమే కాదు.. గతంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోను సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. అయితే సల్మాన్ ఖాన్ నటించిన సినిమాకు రామ్ చరణ్ గెస్ట్ రోల్‌లో నటించడమే కాదు.. ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పారన్న సంగతి చాలా మందికి తెలియదు. రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమా కూడా అదే కావ‌డం విశేషం. సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో.. సినిమా తెలుగులో కూడా డబ్బ్ అయ్యింది.

Prem Ratan Dhan Payo - Disney+ Hotstar

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కు తెలుగు డబ్బింగ్.. రామ్ చరణ్ చెప్పారు. అయితే ఈ సినిమా రెండు చోట్ల పెద్దగా విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు రామ్ చరణ్ వాయిస్ ఇచ్చారన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సనా తో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో సంజయ్ లీల భన్సాలి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.