మాజీ లవర్ తో రష్మిక ఇప్పటికి ఆ పని చేస్తుందా..? రక్షిత్ శెట్టి బయటపెట్టిన సీక్రేట్..!

రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . నేషనల్ క్రష్ గా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాల్లో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . అంతేకాదు రష్మిక మందన్న రీసెంట్గా అండర్ 30 ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది . ఈ క్రమంలోనే పలువురు స్టార్ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు.

రీసెంట్గా ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి దానిపై స్పందించారు . “రష్మిక అనుకున్నది సాధిస్తుంది ఆమెకు జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి . ఆమె గోల్స్ కచ్చితంగా రీచ్ అవుతుంది సో టాలెంటెడ్ ..మేము పెళ్లి బ్రేక్ చెప్పుకున్నా సరే మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నాం.. రష్మిక ఇంకా మంచి స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నాను” అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు . దీంతో రష్మికకు రక్షిత్ శెట్టి కు మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అన్న నెగిటివ్ వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది.

రష్మిక జాన్ జిగిడి దోస్త్ విజయ్ దేవరకొండ సైతం రష్మిక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం పై ప్రశంసలు కురిపించారు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది . ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగావు గుడ్ .. కీప్ రాకింగ్ ఇంకా ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు . కాగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమయాణం కొనసాగుతుంది అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఎప్పుడు ఆ పెళ్లి చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి..?