గుంటూరు కారం ఫ్లాప్.. శ్రీలీలకు ఎంతలా కలిసి వచ్చిందంటే..? లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ ఆఫర్..!

శ్రీ లీల .. ఎంత అదృష్టవంతురాలు అంటే ఫ్లాప్ అయిన సినిమాతో కూడా లక్ ని తన వెంట వచ్చేలా చేసుకునింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పోపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అమ్మడి అదృష్టమో లేక టాలెంట్ నో తెలియదు కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నాయి. రీసెంట్గా నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది .

టాక్ పరంగా దరిద్రంగా ఉంది అంటూ కామెంట్స్ దక్కించుకుంది . హిట్టు ఫ్లాప్ లను పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు.. ఈ కామెంట్స్ ని లైట్ గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అంటూ శ్రీ లీలాను దారుణంగా ట్రోల్ చేశారు ఆకతాయిలు . సినిమాలోని పాత్ర ఏమీ లేదు అని .. కేవలం డాన్స్ కే పనికి వచ్చావు అని బూతులు తిట్టారు . అయితే ఇప్పుడు ఆ బూతులే ఆమె పాలిట వరంగా మారాయి . శ్రీలీలకు గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన కారణంగా ఓ బంపర్ ఆఫర్ వచ్చి చేరిందట .

ఎప్పటినుంచో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలి అనుకుంటున్న శ్రీలీలకు ఈ సినిమా మంచి లక్ ని తీసుకొచ్చిందట . త్వరలోనే తెరకెక్కబోతున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలో శ్రీ లీల ఛాన్స్ అందుకుందట . అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా. ఓ అమ్మాయి డాన్స్ అంటే ఇష్టం ఉండి చదువుకుంటూ కుటుంబ బాధ్యతలను తీసుకుంటూ ఎలా నెట్టుకొచ్చింది అనేది సినిమా స్టోరీ . ఈ సినిమాలో శ్రీ లీల మెయిన్ లీడ్ గా నటించబోతుందట . దీంతో శ్రీలీల ఫ్యాన్స్ ఫుల్ సంబరం పడిపోతున్నారు . సినిమా గుంటూరు కారం ఫ్లాప్ పైన నీకు అంతా బాగానే కలిసి వచ్చింది అంటూ పొగిడేస్తున్నారు..!!