సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా.. ఈ ముద్దుగుమ్మకు ఎన్ని భాషలు వచ్చు అంటే.. ?!

మ‌ళ‌యాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసేసింది. డీ గ్లామ‌ర‌స్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే తన నటించిన సినిమాలు అన్ని దాదాపు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటిస్తూ మెప్పించింది.

Thandel teaser: Naga Chaitanya like he's never been seen before, always-mesmerising Sai Pallavi anchor this patriotic actioner | Telugu News - The Indian Express

అయితే గత కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది సాయి ప‌ల్ల‌వి. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె ఇకపై డాక్టర్గా సెటిల్ అవుతుంది.. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పింది అంటూ పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఎప్పుడు స్పందించని సాయి పల్లవి ఇటీవల నాగచైతన్య తాండేల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్చింది. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్2 బ్యానర్ పై భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సాయి పల్లవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Sai Pallavi talks about Premam-2 and NGK in interview

ఈ వీడియోలో సాయి పల్లవి తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. సాయి పల్లవి అసలు పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్‌, వెయిట్ ఇలా అన్ని చెప్పుకొచ్చింది. సాయి వ‌ల్ల‌వి అస‌లు పేరు సాయి ప‌ల్ల‌వి సింతామరై, పుట్టిన తేదీ 9 – 5 – 1992, క్వాలిఫికేషన్ డాక్టర్, డ్యాన్సర్, యాక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమెకు తెలుగుతో కలిపి సాయి ప‌ల్ల‌వి ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడుతుంద‌ట‌. అవేంటంటే తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ, జార్జియం, బడగా ఇలా అన్ని భాషలు వ‌చ్చట‌.