పవన్ ” హరి హర వీరమల్లు ” స్పెషల్ ప్రోమో.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క రాజకీయాల్లో కొనసాగుతూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ లైన్ అప్ లో ఉన్నటువంటి మూవీస్ లో ” హరి హర వీరమనులు “ఒకటి.

ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఇతర పాత్రలలో బాబీ డియోల్ వంటి వారు నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రస్తుతం గ్రాండ్ లెవెల్ లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నట్లు నిన్న మేకర్స్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

అదేవిధంగా త్వరలో ఈ మూవీ నుంచి ఒక స్పెషల్ ప్రోమో ని కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్పెషల్ ప్రోమో మార్చ్ 8న మహా శివరాత్రి నాడు రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ మూవీ నుంచి ఎటువంటి ప్రోమో రిలీజ్ అవుతుందా అంటూ పవన్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.