రవితేజ ” ఈగల్ ” 4 డేస్ కలెక్షన్స్ ఇవే..!

మాస్ మహారాజ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” ఈగల్ “. ఈనెల 9న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

అదేవిధంగా విడుదలకు ముందు విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ వంటివి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి. కానీ మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి. ఇక ఈ మూవీ 4 డేస్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం. ఈగల్ కి రూ.22.05 కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది.

బ్రేక్ ఈవెంట్ కి ఈ మూవీ రూ. 22.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి ఈ మూవీ రూ. 12.62 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ. 9.68 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ మూవీ కనుక ఏ మాత్రం క్విక్ అయినా సూపర్ రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు.