రాజకీయంలోకి ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన హైపర్ ఆది.. పవన్ కోసం గెలుస్తా అంటూ హామీ..!

తన కామెడీ పంచులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర కార్యక్రమం అయిన జబర్దస్త్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు హైపర్ ఆది. ఇక ఇటీవలే ఆది రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో హైపర్ ఆది పాల్గొని సభలో రాజకీయ ప్రస్తావనలతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తాడు.

ఇక ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి తన రాజకీయం ఎంట్రీపై స్పందించాడు. ఆది మాట్లాడుతూ..” ప్రొఫెషన్ వేరు రాజకీయం వేరు. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అంటే జబర్దస్త్ షో నే కారణం. నాకు రోజా తో ఎలాంటి గొడవలు లేవు. జబర్దస్త్ సెర్చ్ లో రోజా ఎప్పుడు కూడా పాలిటిక్స్ గురించి మాట్లాడరు. నాగబాబు గారు లాగానే ఆమె కూడా నవ్వుతూ ఉంటుంది. తను ఇష్టపడే వ్యక్తులు వేరు నేను ఇష్టపడే వ్యక్తులు వేరు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని.

పవర్ స్టార్ అనుసరించే ప్రతి ఒక్క సిద్ధాంతం నాకు నచ్చుతుంది. నేను పదవులు మరియు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి జనసేనకు సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నాకు జనసేన టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తాను. పవన్ కళ్యాణ్ ను గెలిపించడం కోసమే నేను కలుస్తాను. ఒకసారి అయిన‌ జనసేన తరుపున నేను క్యాంపెయిన్ చేయడానికి వెళ్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ఇక ఈయన వ్యాఖ్యలు విన్న పలువురు ఈయనకి ఒక సీట్ ఇవ్వడం ఖాయం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.