బన్నీ ” పుష్ప 2 ” స్పెషల్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్..!

అల్లు అర్జున్కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది పుష్ప. ఈ సినిమాకి ముందు అనేక సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు బన్నీ. ఇక పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లోని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

అదేవిధంగా నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే పుష్ప 2 నీ కూడా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మీ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోని ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ని అందిస్తున్నారు మేకర్స్. ఇక ఇదిలా ఉండగా ఫస్ట్ పార్ట్ లో దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఐటెం సాంగ్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఇక ఈ మూవీ పార్ట్ 2 లో కూడా ఐటమ్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ కోసం మళ్లీ చాలామంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుండగా ప్రస్తుతం మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ కోసం దిశా పటాని ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనున్న సంగతి తెలిసిందే.