కోడల లావణ్య సినిమాలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.. వైరల్..

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. బిగ్‌బాస్ అభిజిత్ హీరోగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు విశ్వక్‌ కండేరావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యార్లగడ్డ సుప్రియ ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు లావణ్య త్రిపాఠి. మామయ్య నాగబాబు ఈ సిరీస్‌కు తాజాగా రివ్యూ ఇచ్చాడు. కోడలు వెబ్ సిరీస్ ను మామగారు ప్రశంసలతో ముంచేశారు. తప్పకుండా ఈ సీరియస్ చూడమని తన అభిమానులకు సజెస్ట్ చేశాడు.

ఎక్స్ వేదికగా నాగబాబు ట్విట్ చేస్తూ నా ఫేవరెట్ లావణ్య నటించిన అద్భుతమైన వెబ్ సిరీస్ ను ఇప్పుడే చూశా. ఈ సిరీస్‌ చాలా గ్రిప్పింగా అనిపిస్తుంది. సరదాగా ఉంది. హాట్ స్టార్ లో దీన్ని చెక్ చేయాలని నేను బాగా ప్రిపేర్ చేస్తా అంటూ వివరించాడు. ప్రస్తుతం ఈ ట్విట్‌ తెగ వైరల్ గా మారింది. ఇక ఈ మిస్‌ప‌ర్ఫెక్ట్ సిరీస్ ఒక ఓసిడి ఉన్న అమ్మాయి కరోనా టైంలో తన అపార్ట్మెంట్లో ఉన్న చెఫ్ తో ప్రేమలో పడుతుంది తను పనిమనిషిగా అతనికి దగ్గరవుతుంది. వారి ప్రేమను బయట పెట్టడానికి ఒరిజినల్ పనిమనిషి, ఆమె తమ్ముడు తెగ ట్రై చేస్తూ ఉంటారు.

చివరకు ప్రేమించిన అమ్మాయి అబద్ధం చెప్పిందని దూరం పెడతాడు. కాగా ఈ జంట అసలు కలిసారా.. లేదా.. నిజమైన పనిమనిషి ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అనేదే స్టోరీ. ఇక మిస్ పర్ఫెక్ట్ లావణ్య గా మెగా కోడలు నటన అదిరిపోయింది అంటూ ఇప్పటికే పలువురు కామెంట్స్ వినిపించాయి. అసలు బోర్ ఫీల్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్ ని ఎంజాయ్ చేసే విధంగా ఈ సిరీస్ ఉంది అంటూ చాలా మంది త‌మ రివ్యూలో వివ‌రించారు.