బాల‌య్య న‌యా రికార్డును ట‌చ్ చేయ‌డం అసాధ్యం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు దీటుగా హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస హిట్లను కొట్టి హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య.. మరో పక్క బుల్లితెర షో అన్‌స్టాపబుల్ తో మరింత మంది అభిమానులను పెంచుకున్నాడు. ఇక ఈయన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ ఫాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని తమ బ్రాండ్‌కు అంబాసిడర్ గా వ్యవహరించమని చాలా బ్రాండ్లు ముందుకు వస్తున్నాయి. నిర్మాతలు కూడా రూ.100 కోట్లు బడ్జెట్ సినిమాకు అయినా బాలయ్య హీరోగా ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

అయితే ఈ జనరేషన్ టాలీవుడ్ హీరోల ఎంతో మంది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకుంటూ.. వసూళ్లను కలెక్ట్ చేస్తున్న.. రీజనల్ సినిమాలతోనే సంచల వసూలు సాధిస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటూ.. ఈ తరం యంగ్ హీరోలకు సవాళ్లు విసురుతున్నాడు బాలయ్య. గతంలో కథల ఎంపికల విషయంలో కాస్త హేమర పాటుగా ఉండి ఫ్లాపులు ఎదుర్కొన్న తరువాత.. గోడకు కొట్టిన బంతిలాగా స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. ఇక చివరిగా నటించిన మూడు సినిమాలతో తన మార్కెట్ మరింతగా పెంచుకున్న బాలయ్య.. తన సినిమా రిలీజ్ అవుతుంటే కచ్చితంగా హిట్ అవుతుందని అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశాడు. అలాగే ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం రూ.70 కోట్ల షేర్ రాబడుతూ సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇటీవ‌ల వ‌చ్చిన‌ సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి మూడు సినిమాలతో రూ.70 కోట్లకు పైగా గ్రాస్‌వ‌సుళ‌ను కొల్లగొట్టి సీనియర్ స్టార్స్ లో ఆరెంజ్ కలెక్షన్లతో హ్యాట్రిక్ కొట్టిన ఏకైక హీరోగా రికార్డులు సృష్టించాడు బాలయ్య. ఇక ఇలా కథల ఎంపికలో ఆచుతూచి అడుగులు వేస్తూ సినిమాలు తీయడంతో.. బాలయ్య సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ఆసక్తి చెబుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్లో తన 109వ సినిమాల నటిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్లకు పైనే ఉంటుందట. కాగా డైరెక్టర్ తో సంబంధం లేకుండా బాలయ్య సినిమాకు ప్రస్తుతం థియేట్రికల్, నాన్‌థియేట్రికల్ బిజినెస్‌లే రూ.100 నుంచి 150 కోట్ల వరకు జరుగుతుందట.

థియేటర్లలో రూ.70 కోట్ల షేర్లు రాబడుతుంటే.. ఓటీటీలు, టీవీల ద్వారా కూడా ఆయన సినిమాలకు అదే రేంజ్ ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని టాక్. దీంతో నిర్మాతలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. మరో పక్క బాలయ్య బిజీ లైన‌ప్‌ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఆయన మార్కెట్ మరింత పెరిగేలా కనిపిస్తుంది. బాబి తో సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో అఖండ 2 ను ప్లాన్ చేశాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించినున్నాడు. ప్రస్తుతం బాలయ్య జోరు ఆయన సినిమాల లైనప్‌ చూస్తుంటే మరోసారి పక్కాగా డబల్ హ్య‌ట్రిక్ కొడతాడు అనిపిస్తుంది. అదే జరిగితే బాలయ్య మార్కెట్ను టచ్ చేయడం ఏ సీనియర్ హీరో వల్ల సాధ్యం కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.