ఒరేయ్.. బాబు వాడిని ఆపండ్రా.. ‘దేవర’ స్టోరీ మొత్తం లీక్ చేసేస్తున్నాడుగా..!!

అసలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు . ఎప్పుడెప్పుడు దేవర సినిమా రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ ను డిఫరెంట్ గెటప్ లో చూస్తామా ..? అంటూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు . అలాంటి వాళ్లకు దేవరకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది . అయితే సినిమా గురించి ఇంపార్టెంట్ విషయాలు లీక్ అయిపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాను చూసే ఇంట్రెస్ట్ ఉండదు . ఈ క్రమంలోనే మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. సినిమాలో నటించే నటీనటులు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని సజెస్ట్ చేస్తున్నారు .

రీసెంట్గా పులి రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో దేవరకు సంబంధించిన విషయాలను బయటపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పులి రాజేందర్ రీసెంట్ గా సలార్ సినిమాలో కనిపించి బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న పులి రాజేందర్ దేవర గురించి మాట్లాడుతూ..” సినిమాలో నాది శ్రీకాంత్ గారి పక్కనే ఉండే పాత్ర.. చాలా ఇంపార్టెంట్ రోల్.. మంచి పేరు తీసుకొస్తుంది ..సినిమాలో ఎన్టీఆర్ , షైన్ టైం చాకో, శ్రీకాంత్ వీళ్లంతా కలిసి ఉంటారు ..ఫ్రెండ్స్ లా చాలా జోవియల్ గా మాట్లాడుకుంటారు “..

“జాన్వి కపూర్ ..శ్రీకాంత్ కూతురు అంటూ క్రేజీ మ్యాటర్ లీక్ చేశాడు . అంతేకాదు వి ఎఫ్ ఎక్స్ ఈ సినిమాలో అదిరిపోతాయని ..2024 లో ఇది ఒక సంచలనంగా మారిపోతుంది అని ..ఇప్పటికే నేను 50 రోజుల షూటింగ్లో పాల్గొన్నాను అని ..సినిమాకి సంబంధించిన కీ పాయింట్స్ లీక్ చేశాడు “. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పులి రాజేందర్ పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు . అరే బాబు వాడిని ఎవరైనా ఆపండి.. వదిలితే కథ మొత్తం చెప్పేసేలా ఉన్నాడు . ఈ ఇంటర్వ్యూ కొరటాల చూస్తే ఇంకేమన్నా ఉందా ..? పిలిచి వాతలు పెడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . పులి రాజేందర్ ఈ ఇంటర్వ్యూలో క్రేజీ మ్యాటర్ ని కూడా లీక్ చేశాడు. వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటారట . కానీ రెండు వర్గాలుగా విడిపోతారట . దానికి కారణం ఒక గొడవ . అదే దేవర రెండు భాగాలుగా చేసిందట..!!