ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్.. వార్ 2లో తారక్ రోల్ ఇదే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుందంటూ తెలుస్తుంది. కాగా మరో హీరోయిన్గా అలియాభట్ కనిపించబోతుందట. ఇక పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న స్టార్ హీరో, హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఆసక్తి మొదలైంది.

ఈ మూవీ కోస్ ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపద్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ప్రేక్షకులు వెంటనే దాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో ఎన్టీఆర్ రోల్ ఏంటి అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో ఎన్టీఆర్ నెగిటివ్ షెడ్ లో కనిపించబోతున్నాడు అంటూ నెట్టింట‌ వార్తలు వినిపించాయి. జై లవకుశ తరహాలో నెగిటివ్ షెడ్స్‌ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని వార్తలు చక్కర్లు కొట్టాయి.

తాజాగా దీనిపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడట. పూర్తిగా తారక్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. అతి భయంకరమైన పాత్రలో మూవీ మొత్తం హృతిక్ రోషన్ తో తలపడుతూ కనిపించనున్నాడు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ అలాంటి సీన్లని పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే జై లవకుశ నెగిటివ్ షేడ్స్‌లో మెప్పించిన ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో విలన్ పాత్రలో ఇంకెంత ప‌వ‌ర్‌ఫుల్గా కనిపించబోతున్నాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.