మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. ఆ భారీ బడ్జెట్ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ మ‌రీ అంత త‌క్కువా..

టాలీవుడ్‌ స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో మొదటి వరుసలో ఉన్న రెబల్ స్టార్.. ఇటీవల మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నాడంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదలైంది. ఈ ప్రకటన చూడగానే చాలామంది షాక్ అయ్యారు. మ‌రికొంత‌మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ను మరింత వైరల్ చేస్తూ కన్నప్ప సినిమాపై హైప్ పెంచేశారు. అయితే ప్ర‌స్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం పది నిమిషాలు నడివిలో మాత్రమే శివుని పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడట‌.

కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ పారితోషకం ఎంత అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా ప్రబాస్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్తలు నెట్టింట‌ తెగ వైరల్ గా మారాయి. అయితే ప్రభాస్ గ‌తంలో బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే మంచు విష్ణు దేనికైనా రెడీ సినిమాతో ప్రభాస్ వాయిస్ కు సంబంధించిన కొన్ని సీన్లు తెర‌కెక్కాయి. ఇలా మంచు వారి ఫ్యామిలీతో ప్ర‌భాస్‌కు మంచి బాండింగ్ ఉంది.

అలాగే భక్త కన్నప్ప రోల్ అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం కావడంతో ప్రభాస్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక‌ సినిమా కోసం ఒకటి లేదా రెండు రోజుల డేట్స్ కేటాయిస్తే సరిపోతుందట. కాగా భక్తకన్నప్ప మూవీ రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే కాగా. ఈ నేపథ్యంలో.. అంత భారీ బడ్జెట్లో తెర‌కెక్కిస్తున్న సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ నటించడంలో మేకర్స్‌కు మరింత ప్లస్ కానుంది.