తారక్ మిస్ చేసుకున్న స్టోరీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఆ మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు మహేష్. అయితే మహేష్ స్టోరీ సెలక్షన్ విషయంలో ఆశతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందుకే ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా సెట్స్‌ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటివరకు ఇండస్ట్రియల్ రికార్డ్స్ అన్నిటినీ ఈ సినిమా బ్రేక్ చేస్తుందని మేకర్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రూ1000 కోట్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొట్టమొదటి భారతీయ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక మహేష్ కెరీర్‌ స్టార్టింగ్ లో నటించిన మురారి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు మొదట కృష్ణవంశీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకోవాలని భావించాడట.

కానీ ఈ సినిమా కథ సూప‌ర్ స్టార్ కృష్ణ దగ్గరికి వెళ్లడంతో.. ఈ సినిమాను మహేష్ బాబుతో చేయమని కృష్ణవంశీని ఆయ‌న అడగడం.. దాంతో ఆయన కాదనలేక కృష్ణవంశీ.. మహేష్‌ను మురారి సినిమాలో తీసుకుని తెర‌కెక్కించడం జరిగిందట‌. ఈ సినిమాతో మహేష్ బాబు మొట్టమొదటి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోని మహేష్ తన వైవిధ్యమైన నటనతో సత్తా చాటుకున్నాడు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ చేయవలసిన ఆ సినిమాను మహేష్ బాబు నటించిన సక్సెస్ అందుకున్నాడని న్యూస్ వైరల్ అవడంతో.. అయ్యయ్యో తారక్ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అవ్వడం నిజంగా బ్యాడ్ లక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జ‌నం.