బిగ్ బ్రేకింగ్ : మహిళ జర్నలిస్ట్ పై వివాదాస్పద కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడికి జైలు శిక్ష..

కోలీవుడ్ స్టార్ యాక్టర్, స్టార్ పొలిటిషన్ ఎస్వి శేఖర్ కు నెల రోజులు జైలు శిక్ష.. 15వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్ట్‌ సోమవారం తీర్పు వెల్లడించింది. 2018 లో ఎస్ వి శేఖర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పలు వివాధాలకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశిస్తూ 2018లో న‌టుడు శేఖ‌ర్ చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు అందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారంటూ వివాదాస్పద పోస్ట్‌ షేర్ చేశాడు.

అప్పట్లో దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. చెన్నై మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్లు విచారణలో వెలువడింది. అదే టైంలో ఆయన పశ్చాతాపం తెలియజేస్తూ క్షమాపణలు కోరుకున్నారు. కానీ కేసు మాత్రం అలాగే కొనసాగింది. ఈ కేసు రద్దు చేయాలని నటుడు శేఖర్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్క ఎదురయింది. హైకోర్టు కూడా విచారణలను ఎదుర్కోవాల్సిందే అంటూ తీర్పు ఇచ్చింది.

దీంతో చెన్నై కలెక్టరేట్ వ‌ద్ద‌ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ విచారణ‌లో వాదనలు జ‌రుగుతూ వ‌చ్చాయి. ఇక తాజాగా విచార‌ణ ముగియ‌డంతో సోమవారం ఈ కేసు పై తీర్పు వెలెవ‌డింది. ఎస్వి శేఖర్ కు నెల రోజులు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధించింది. ప్రత్యేక బెయిల్ కల్పించాలని ఎస్వీ శేఖర్ తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవకాశం ఇస్తూ తాత్కాలికంగా శిక్షణ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్ట్. ఆపిల్ కోసం రెండు నుంచి నాలుగు వారాలు ప్రయత్నాలు చేసుకోవాలని ఆ నెక్స్ట్ ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.