ఆఫర్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు నటి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నటినట్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా.. లేదా ఏవైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం వెండి తెరకు సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే ఈ విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా బుల్లితెరలోను ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఓ సీరియల్ నటి వెల్లడించింది. బ్రహ్మ ముడి సీరియల్ నటి నైనిషా రాయ్ తన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది.

Nainisha Rai: కమిట్మెంట్ అడడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. తినడానికి లేక  రక్తం అమ్ముకున్నా! - NTV Telugu

మా ఇంట్లో యాక్టర్ అవుతానంటే అసలు ఒప్పుకోలేదు.. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు.. నటన మీద ఇంట్రెస్ట్ తో ఇంటి నుంచి బయటకు వచ్చేసా.. తర్వాత తినడానికి తిండి లేక చోట డబ్బులు ఇస్తారని తెలిసి బ్లడ్ కూడా డొనేట్ చేశాను.. ఈ నేపథ్యంలో ఆఫర్స్ కోసం కొంతమంది దగ్గరకు వెళ్తే అవకాశం ఇస్తే నాకేంటి అంటూ తప్పుగా మాట్లాడే వారిని.. కమిట్మెంట్ అడిగే వారిని.. మరికొందరు ఆఫర్ ఇచ్చాక కమిట్మెంట్ అడగడం మొదలు పెట్టేవార‌ని వివ‌రించింది.

Brahmamudi Serial:బ్రహ్మముడి సీరియల్ అప్పు రియల్ లైఫ్...అసలు నమ్మలేరు

షూటింగ్ మొదలవుతుండగా నన్ను బలవంతం చేయడంతో కొట్టి తప్పించుకునేదాన్న‌ని ఆ తర్వాత ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఆదరిస్తారో లేదో అనే అనుమానం వచ్చి ఆగిపోయానని.. చాలాసార్లు ఇంటికి వెళ్లాలనిపించిందని ఒక సందర్భంలో చనిపోవడం మంచిదని భావించాను అంటూ వివరించింది. దాంతో చాలాసార్లు నేను సూసైడ్ ఎటంప్ట్‌ చేశాను. ఆ తర్వాత ధైర్యంతో ముందు అడుగు వేసి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్న అంటూ వివరించింది. కాకపోతే ప్రస్తుతం నైనిషారాయ్‌ బ్రహ్మముడి, శ్రీమంతుడు, వంటలక్క లాంటి సీరియల్స్ లో నటిస్తూ వరుస‌ ఆఫర్లను అందుకుంటుంది. అలాగే టీవీ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంది నైనిషా.