రాజమౌళి సినిమాలో అలాంటి జబ్బు ఉన్న మనిషిగా కనిపించబోతున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పోపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు దర్శకధీరుడుగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్స్ రిలీజ్ అవుతాయా..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు జనాలు.

రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరొక క్రేజీ అప్డేట్ నెట్టింట లీకై వైరల్ అవుతుంది. స్టార్ దర్శకుడు సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఆ మూవీలో మన హీరో రోల్ ఏంటి ..? ఎలా కనిపించబోతున్నాడు ..? అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది . మరి ముఖ్యంగా ప్రిన్స్ మహేష్ బాబుని ఏ విధంగా రాజమౌళి చూపించబోతున్నాడు అంటూ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే దానికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది .

సూపర్ స్టార్ రోల్ చాలా ఇంటెన్సీగా ఉండబోతుందట. సాలిడ్ వేరియేషన్స్ తో మస్తు షేడ్స్ ఉన్న రోల్లో సూపర్ స్టార్ కనిపించబోతున్నాడట. అంతేకాదు టోటల్గా ఇప్పటివరకు మనం ఎప్పుడూ చూడని మహేష్ బాబు లుక్ ను ఈ సినిమాలో చూడబోతున్నామట . అంతేకాదు ఈ సినిమాలో ఓ జబ్బు మనిషిగా కనిపించబోతున్నాడట మహేష్ బాబు. గుంటూరు కారంలో ఒక కన్ను కనిపించని వ్యక్తిగా కనిపించాడు మహేష్ బాబు . ఆ సినిమా నెగిటివ్ టాక్ అందుకుంది . దీంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు . మరోసారి అలాంటి రిస్క్ అవసరమా ..? అంటూ కంగారు పడుతున్నారు..!!