నా రూమ్ లో నిద్రపోతున్న.. హీరో తాగి వచ్చి తలుపు తీయమంటూ బలవంతం చేశాడు.. నటి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెలబ్రిటీగా పాపులారిటీ ద‌క్కించుకోవాలంటే అంత సులువైన పని కాదు. దానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలో క్యారెట్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నాలుగు వంద‌ల‌కుపైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది తమిళ నటి వెన్నర అడై నిర్మల. తన నటనతో ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీనియర్ నటి.. వెన్నెర ఆడై సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే ప్రతి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించి మెప్పించింది. ఇంటి వెలుగు, దత్తపుత్రుడు, పిచ్చి పిల్ల, బొమ్మ బొలుసు, మదర్ ఇండియా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా ఇలా ఎన్నో టాలీవుడ్ హిట్ సినిమాలు ఆమె నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Senior Actress Vennira Aadai Nirmala Reveals About Bad Incident In Her  Career - Sakshi

నందమూరి నట‌సింహం బాలయ్య సినిమాల్లో కూడా ఆమె మెప్పించింది. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది అయితే గతంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి సీనియర్ నటి వెన్నెల నిర్మల మాట్లాడుతూ నేను తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించ దాదాపు కొన్ని ఏళ్ళ క్రితం తెలుగులో నటిస్తుండగా చేదు అనుభవాన్ని చూడాల్సి వచ్చింది. దాంతో నేను ఆ సినిమా నుంచి కూడా తప్పుకున్న అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమా షూటింగ్ టైంలో నేను నా రూమ్ లో నిద్రపోతున్నానని వివ‌రించింది.

A new chapter in 'Veenira Aadai' Nirmala's life - The Hindu

రాత్రి టైం లో మూవీ హీరో వచ్చి తలుపు కొట్టి మరీ తలుపు తీయండి నేనేంచేయను మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అంటూ మాట్లాడాడు.. తాగి వచ్చి ఆయన అలా మాట్లాడుతుంటే నాకు భయమేసిందని.. నేను ఆ ఘటనతో ఎంతో ఆశ్చర్యపోయా అంటూ వివరించింది. ఆ తర్వాత నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను.. దర్శక నిర్మాతలు నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించిన నేను అందులో నటించడానికి ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ నటుడి పేరు ఏంటో చెప్పడానికి నాకు ఇష్టం లేదంటే చెప్పి.. వెంటనే తనకంటే 13 ఏళ్ల చిన్నవాడైన తెలుగు నటుడు ఇలాంటి ప్రవర్తన నేను ఊహించలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.