“మీ అబ్బాయ్ జీవితాని ఛండాలంగా మార్చకండి”.. మహేశ్ విషయంలో కృష్ణ కే వార్నింగ్ ఇచ్చిన ఆ డేరింగ్ డైరెక్టర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్ లో ఆకట్టుకోవడం మహేష్ బాబుకి మొదటి నుంచి అలవాటు . ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోయినటించడం మహేష్ బాబుకు వెన్నతో పెట్టిన విద్య . సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి ఆయనకు ఆ అలవాట్లు వచ్చాయి అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్ పొగిడేస్తూ ఉంటారు .

కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు కోసం మహేష్ బాబు నాన్నగారు కృష్ణ గారిని ఎదిరించారు ఒక డైరెక్టర్ అన్న వార్త వైరల్ అవుతుంది. ఆయన మరెవరో కాదు కృష్ణవంశీ . కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా మురారి . ఈ సినిమా అప్పట్లో చరిత్ర సృష్టించింది . సూపర్ డూపర్ హిట్ అయింది . మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పింది .

అయితే ఈ సినిమాలో అలనాటి రామచంద్రుడి సాంగ్ పెట్టొద్దు అంటూ ఒక కమర్షియల్ సాంగ్ ప్లాన్ చేయమంటూ కృష్ణ బలవంతం చేశారట . అయితే కృష్ణవంశీ మాత్రం అలా ఎప్పటికీ చేయను.. మీ కొడుకు కెరియర్ని ఛండాలంగా మార్చేయద్దు.. ఈ పాట ఆయన కెరియర్ లోనే సూపర్ హిట్ అవ్వబోతుంది దయచేసి అడ్డుకోవద్దు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే ఈ సినిమాను ఇక్కడితోనే ఆపేస్తాను “అంటూ గట్టిగానే చెప్పుకొచ్చారట. దీంతో కృష్ణ ఏమి చేయలేక వదిలేసాడట . కృష్ణవంశీ చెప్పినట్లే ఈ సినిమాకి ఈ పాట హైలైట్ గా మారింది. ఇప్పటికీ ఏ పెళ్లిళ్లు జరుగుతున్న ఈ పాట ఉండాల్సిందే..!!