షాకింగ్ : టీఎస్ న్యాబ్ పోలీసుల నుంచి ఆ మెగా హీరోకు నోటీసులు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది డైరెక్షన్లో గాంజా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు తాజాగా ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ యాంటీనార్కటిక్స్ బ్యూరో పోలీసులు ఈ సినిమా మేకర్స్ కు నోటీసులో జారీ చేశారట‌. ఇక మెగా హీరో సాయిధరమ్, సంప‌త్‌ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా ఇప్పటికే ఆగిపోయిందని.. ఈ సినిమాను కొద్దిరోజులు హోల్డ్ లో పెడుతున్నారంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన‌ మరో వార్త తెగ వైరల్ అవుతుంది. తెలంగాణ న్యాబ్ పోలీసులు గాంజా శంకర్ అనే టైటిల్ లో గంజాయి ఉండడంతో కథాంశ‌న్ని పునఃపరిశీలించాలని మూవీ మేకర్స్‌కు నోటీసులు అందించారట. హీరో సాయి ధరమ్‌తేజ్, దర్శకుడు సంపత్ నంది, నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి ప్రభుత్వం ఈ నోటీసులు అందించిందని తెలుస్తోంది. సినిమాలో మాదకద్రవ్యాల వినియోగం మరియు అమ్మకాలను తెలియకుండానే ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తోందట.

ఇది ఎన్‌డిపిస్‌ చట్టాన్ని క్రాస్ చేసినట్లు అవుతుంది. దీంతో పోలీసులు సాయి ధరంతేజ్ కు, గాంజా శంకర్ మేకర్స్ కు నోటీసులు అందించారని తెలుస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంగిస్తే చెట్ట ప‌రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్‌కు నోటీసులు అందాయ‌ట. సితార ఎంటర్టైన్మెంట్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు రూపొందిస్తున్నారు. కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి బీమ్ సిసీరోలియో సంగీతం అందిస్తున్నాడు.