డార్లింగ్ మూవీ నుంచి మరో లీక్… మండిపడుతున్న ఫ్యాన్స్..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రభాస్ మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

వాటిలో నిర్మాత నాగ్ అశ్విన్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి కల్కి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక మూవీ నుంచి రీసెంట్ గానే లీక్ లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ కాకుండా ది రాజా సాబ్ నుంచి కూడా మరో లీక్ బయటికి వచ్చింది.

అయితే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. కానీ అది ఈ సినిమాలోని కాదన్నట్లు తెలుస్తుంది. అది జస్ట్ రూమర్ మాత్రమే అయినట్లు ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్ రాలేదని సినిమా చిత్ర బృందం వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సో రాజా సబ్ డైలాగ్ ఏది లీక్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈ మూవీ నుంచి కూడా ఓ డైలాగ్ లీక్ అయింది అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరిపై మండిపడుతున్నారు.