బిగ్ బ్రేకింగ్: ‘ కీడాకాలా ‘ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పై.. ఎస్పీ చరణ్ లీగల్ యాక్షన్.. కారణం ఇదే..

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ చివరిగా తెరకెక్కించిన మూవీ కీడాకోల. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు.. ఎస్పీ చరణ్ ఈ సినిమాపై, అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది.. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కారణాలేంటి.. ఒకసారి చూద్దాం.

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కీడాకోల మూవీలో ఓ సన్నివేశం కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని వాడుకున్నారు. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఆయన వాయిస్ ని సినిమాలో ఉపయోగించడంతో ఈ సినిమా పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఎస్పీ చరణ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సింగర్ గా ఎలాంటి సంచలన క్రియేట్ చేశాడా అందరికీ తెలుసు. ఆయన వాయిస్ కి అంత పవర్ ఉంది. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ అనుమతి లేకుండా తండ్రి బాలసుబ్రమణ్యం వాయిస్ ని వాడుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఎస్‌పీ చ‌ర‌ణ్‌.ఈ విషయంలో తను క్షమాపణ కోరుతున్నారు.

ఇంకా దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైన చరణ్.. ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారట. అంతేకాదు మూవీ రాయలటీ షేర్ ని కూడా అడుగుతుండడం అంద‌రికి ఆశ్చర్యానికి క‌లిగిస్తుంది. ఇక ఈ వివాదం ముందు ముందు మరింత ముదురుతున్న క్ర‌మంలో దీనిపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. పరిహారాన్ని చెల్లిస్తారా.. లీగల్ గా ప్రొసీడ్ అవుతారా.. అనేది ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పుతుంది. అయితే సినిమా రిలీజ్ అయిన ఇన్నాళ్లకు ఎస్పి చ‌ర‌ణ్‌ రియాక్ట్ అవ్వడం పై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చ‌ర‌ణ్ ఒక పక్కన సింగర్ గా రాణిస్తూనే.. మరోవైపు పలు పాటల ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.