ఎన్టీఆర్ కి మామ గా మారిన టాలీవుడ్ స్టార్ హీరో.. కొత్త సంవత్సరం కొత్త బంధాలు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ కు మామగా ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా..? అంటే ఎస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు హీరో శ్రీకాంత్ . చిన్నప్పటి నుంచి బాబాయ్ ..బాబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకున్న శ్రీకాంత్ ని ఇప్పుడు ఎన్టీఆర్ మామ అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది.

అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులేండి రీల్ లైఫ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు . అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ జాన్వి కపూర్ కు తండ్రిగా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందట. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ – జాన్వి – శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్స్ డైలాగ్స్ సినిమాకి హైలెట్గా ఉండబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ నెల 8 న తారక్ నటిస్తున్న దేవర గ్లిమొస్ ను రిలీజ్ చేయబోతున్నాడు కొరటాల శివ. ఈ సినిమా ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా సాయి పల్లవి సెలక్ట్ అయిన్నట్లు తెలుస్తుంది..!!