సుకుమార్ మాస్టర్ ప్లాన్ రెడీ .. నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే.. రోమాలు నిక్కబొడ్చుకోవాల్సిందే..!

సుకుమార్.. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ . ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్య – ఆర్య2- 100% లవ్ – నాన్నకు ప్రేమతో- రంగస్థలం లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఆయన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు . పుష్ప2 తో ఏకంగా గ్లోబల్ స్థాయిని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు .

పుష్ప 2 తరువాత తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినట్లు తెలుస్తుంది సుకుమార్. పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సుకుమార్ ఇప్పుడు పుష్ప 2 సినిమా తర్వాత తెరకెక్కించాల్సిన సినిమాను లైన్లో పెట్టబోతున్నాడట . అయితే పుష్పకు మించిన పవర్ ఫుల్ లైన్ తో ముందుకు వస్తున్న సుకుమార్ ఈ సినిమాను రియల్ బ్రదర్స్ తో తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ అప్పుడే బ్రదర్స్ రిలేషన్షిప్ జెన్యూన్ గా బయటపడుతుంది అంటూ డిసైడ్ అయ్యారట.

కోలీవుడ్ మెగా బ్రదర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య – కార్తీక్ లతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నాడు సుకుమార్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ సినిమా ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడట సుకుమార్. అంతేకాదు సుకుమార్ ఈ సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడట.