సంక్రాంతి బరిలో రానున్న సినిమాలకు.. ఏ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

సంక్రాంతి సీజన్ వస్తుందంటే చాలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాల హడావిడి మొదలైపోతుంది. సంక్రాంతి బరిలో పోటాపోటీగా స్టార్ హీరోల సినిమాలు వచ్చి మంచి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలో హీట్ పెరిగిపోయింది. పండగ సెలవుల నేపథ్యంలో ఏ సినిమాను వెనక్కి తగ్గించేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఇష్ట‌ప‌డ‌ట్లేదు. మామూలు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్లు.. సంక్రాంతి టైంలో మూడు రోజుల్లోనే వస్తాయి కనుక దర్శక, నిర్మాతలు కూడా సంక్రాంతి రేసులోనే తమ సినిమా ఉండాలని భావిస్తున్నారు.

అయితే థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్ అడ్జస్ట్మెంట్ విషయంలో కాస్త ఇబ్బంది ఉన్నా సంక్రాంతిలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా సంక్రాంతి వల్ల వచ్చే సినిమాల్లో థియేట్రికల్ బిజినెస్‌లు ఎంత.. ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలో ఒకసారి చూద్దాం. సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నింటిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా గుంటూరు కారం ఉంది. మహేష్ త్రివిక్రం కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ధియేట్రికల్ బిజినెస్ రూ.150 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది.

ఇక వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాకు రూ.34 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్‌, మాస్ మహారాజ్ రవితేజ ఈగిల్ మూవీకి రూ.26 కోట్ల బిజినెస్, కింగ్ నాగార్జున నా స్వామి రంగాకు రూ.22 కోట్లు బిజినెస్, తేజ సజ్జా హనుమాన్‌కు రూ.14 కోట్ల థియేట్రిక‌ల్ ఇజినెస్ జ‌రిగింద‌ట‌. ఇలా చాలావరకు ఇవే ఈ సినిమాల ఫైనల్ థియేటర్ల్ బిజినెస్ లు అవుతాయి. ఈ ఫిగర్స్ ని సినిమాలు క్రాస్ చేశాయంటే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్లే. మరి ఏ సినిమా బ్రేక్ఈవెన్ టార్గెట్‌ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశలో దూసుకుపోతుందో, ఏ సినిమాకి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి.