హ‌నుమాన్ సీక్వెల్లో రామ్‌చ‌ర‌ణ్ రోల్ ఇదే.. 100 % గూస్‌బంప్స్ మ్యాట‌ర్ ఇది..!

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమాకు ప్రేక్షకులో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా ఈ సినిమా సీక్వెల్ గా జై హనుమాన్ త్వరలోనే సెట్స్ పైకి రానంది.

LeelaMadhuri on X: "May You Always Be Accompanied With Auspiciousness and  Blessings By Lord Hanuman 🥰 Good morning @AlwaysRamCharan ❤️  https://t.co/fMH3dU7m2X" / X

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ మొత్తం పూర్తయిందని.. భారీ హంగులతో సినిమాలో రూపొందించబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా వివరించాడు. హనుమాన్ పాత్రలో ఓ అగ్ర హీరో నటిస్తారంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమాన్ పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ స్వతహాగా ఆంజనేయుడు భక్తులు కావడంతో ఈ వార్తలకు మరింత హైప్ నెలకొంది.

Prasanth Varma announces HanuMan sequel on Ram Mandir Pran Pratishtha -  Hindustan Times

అయితే ఈ ప్రచారంలో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాలి. అయితే ఈ వార్త నిజమైతే రామ్ చరణ్ ఫాన్స్ కు ఇది 100% గూస్ బంప్స్ తెప్పించే మ్యాటర్ అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.