సైలెంట్ గా వచ్చి మిస్సైల్ లా దూసుకుపోయిన స్టార్స్ వీళ్లే.. అందరి పేరు ఒకటే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రశాంత్‌ మానియా కొనసాగుతుంది. ప్రశాంత్ పేరుతో ఉన్న సెలబ్రిటీలే టోటల్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని రూల్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నెలరోజుల పాటు టాలీవుడ్‌ని వీరు ఓ ఊపు ఊపేశారు. మెల్లగా వచ్చి మిస్సైల్‌లా దూసుకుపోతున్న ఆ సెలబ్రిటీస్ ఎవరు.. ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ప్రశాంత్ సృష్టించిన సంచలనాలు ఓ రేంజ్ లో లేవు. వారి పేరు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. టీవీ రంగంలోనూ వినిపిస్తుంది. డిజిటల్ రంగాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.

ఇటీవల ప్రభాస్ నటించిన సలార్‌ సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఈ సినిమా ప్రభాస్ సత్తా ఏంటో నిరూపించింది. నార్త్ లో ఢంకీ లాంటి పెద్ద సినిమానే దాటి విజయాన్ని సాధించింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను దాటి భారీ లాభాలను సొంతం చేసుకుంది. అయితే షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఢంకీ కూడా రావడంతో కాస్త కలెక్షన్ల పై ప్రభావం పడిందని చెప్పవచ్చు. లేదంటే వేయి కోట్లు దాటేది. ఈ సినిమాకు దర్శకుడుగా ప్రశాంత్‌ని వ్యవహరించాడు.

కేజిఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ సలార్ తో ఈ ఏడాది చివర గెలుపుతో ముగింపు పలికాడు. సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన హనుమాన్ మూవీ హనుమంతుడు ఎలిమెంట్లతో వచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. రూ.200 కోట్లు దాటి రూ.300 కోట్ల దిశగా వెళుతున్న ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన మ్యాజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది.

ఓ రకంగా ఈ మూవీకి అసలైన హీరో ప్రశాంత్ వర్మ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ ప్రశాంత్‌నీల్ వెండి తెర‌ను షేక్ చేస్తే పల్లవి ప్రశాంత్ బుల్లితెరను ఓ ఊపుఊపేశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో సాధారణ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రశాంత్ రాను రాను తన విశ్వరూపం చూపించాడు. షో మధ్యలోకి వచ్చేసరికి హౌస్ కింగ్ లాగా మారిపోయాడు. టాస్క్ లో నామినేషన్ లో దుమ్ము దులిపిన ప్రశాంత్ ఫైనల్ లో టైటిల్ విన్నారుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

బిగ్ బాస్ షో తర్వాత ఆయన పేరు తెలుగు ప్రేక్షకుల్లో మారుమోగిపోయింది. ఈ ముగ్గురు ప్రశాంత్‌లే కావడంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ ప్రశాంత్‌ల‌ హవా మాములుగా లేదు అంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నెల రోజుల్లోనే వీరు ముగ్గురు పేర్లు ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయాయి. మొదట పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ను ఓ ఊపుఊపాడు. ఆ తరువాత ఐదు రోజులకే ప్రశాంత్ నీల్ స‌లార్‌తో బ్లాక్ బస్టర్ సృష్టించాడు. ఇక నెల కూడా కాకముందే హనుమంత్ తో ప్రశాంత్ వర్మ మంచి రికార్డులు క్రియేట్ చేశారు.