ఆ విషయంలో సుకుమార్ – ప్రశాంత్ వర్మ దొందూ దొందే.. ఎవడిని మార్చలేం..!

ప్రజెంట్ సోషల్ మీడియాలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా హనుమాన్ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవ్వడం గమనార్హం. చాలా చిన్న బడ్జెట్ తో .. చాలా సింపుల్ లైన్ తో .. అందరికీ అర్థమయ్యే విధంగా హనుమాన్ సినిమాను తెరకెక్కించడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ గా మారిపోయింది .

అయితే ఇలాంటి మూమెంట్లోనే ప్రశాంత్ వర్మకు డైరెక్టర్ సుకుమార్ కు మధ్య ఉన్న కొన్ని కామన్ పాయింట్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే సుకుమార్ తన సినిమాలను తెరకెక్కించుకోవడమే కాకుండా పక్క సినిమాలకు స్క్రిప్ట్ అందించడం పక్క సినిమాలో నిర్మించడం వంటివి చేస్తూ ఉంటాడు.

అయితే ప్రశాంత్ వర్మ కూడా ఇప్పుడు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు . ప్రశాంత్ వర్మ తన సినిమాలను తెరకెక్కించుకోవడంతో పాటు పక్క సినిమాలకి స్క్రిప్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట . అంతేకాదు ఇద్దరూ కూడా డైరెక్షన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ . సినిమాల షూటింగ్ టైంలో మాత్రం వాళ్లు అనుకున్నది కచ్చితంగా వచ్చేంతవరకు సదరు నటీనటులను ఇబ్బంది పెడుతూనే ఉంటారట. ఆ విషయంలో సుకుమార్ తర్వాత ప్రశాంత్ వర్మ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!