బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ సన్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన సైఫ్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
తనకోసం తను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని వివరించారు. ఈ గాయం, ఈ ట్రీట్మెంట్ అంతా నా పనిలో భాగమే అంటూ ఆయన తెలియజేశాడు. న్యూ మెడికల్ టెక్నాలజీ అందుబాటులో ఉండడం నాకు చాలా సంతోషాన్ని కల్పిస్తుందని.. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు అంటూ వివరించాడు. ఇక దేవర షూటింగ్ టైంలో ఆయన మోకాళ్ళకు, మోకానికి తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన సైఫ్ అవన్నీ కేవలం పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.
ఇక సైఫ్ అలిఖాన్ త్వరగా కోలుకోవాలని ఆయనని సెట్ లో చూడడానికి మేమంతా ఎదురు చూస్తున్నాము అంటూ దేవర మేకర్స్ ట్విట్ చేశారు. ఇక ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో, హీరోయిన్‌లుగా.. సైఫ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ ఇప్పటికే రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
Wife Kareena in Saif ‘s support as he returns post surgery 🫶🏻♥ #saifreena #saifalikhan #kareenakapoor #KareenaKapoorKhan pic.twitter.com/o6IFuzJGcD
— 01_Assinet (@SSaifeena) January 23, 2024