అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు.. పవన్ బాటలో అదే పని చేస్తున్న ఆద్య..!

సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు ఆయనను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా ఆయనకు సంబంధించిన వార్తలను ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే కోట్లాదిమంది అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ మంచితనాన్ని ఆయన చేసే ప్రజాసేవని గుర్తిస్తూ ఉంటారు . గతంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన పిల్లల గురించి ఎప్పుడూ అనేక విషయాలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది . ఎక్కడ అకిరా నందన్ కనిపించిన కాబోయే పవర్ స్టార్ అంటూ జనాలు ఆయన కటౌట్ ని ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆధ్యా పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . రీసెంట్గా అన్నా చెల్లెలు ఇద్దరు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్లో సందడి చేశారు . వీళ్ళ ఫొటోస్ బాగా ట్రెండ్ అయ్యాయి.

అయితే రీసెంట్ గా ఆధ్యా కరాటే బాక్సింగ్ తరహాలో మార్షల్ ఆర్ట్స్ పంచులు విసురుతూ కనిపించిన ఫొటోస్ షేర్ చేసింది రేణు దేశాయ్ . ఆమె సరదాగా అలా పంచుల విసురుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ధ్రిల్ గా ఫీల్ అయిపోతున్నారు. గతంలో తండ్రి ఇప్పుడు కూతురు ఇద్దరు ఒకటే .. బ్లడ్ ఎక్కడికి పోతుంది ..తండ్రి బాటలోనే కూతురు పయనిస్తుంది అంటూ ఆధ్యాను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . ప్రెసెంట్ ఆద్య కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)