మరోసారి ప్రభాస్ కాలుకు సర్జరీ.. తిరగబెట్టిన అనారోగ్యం .. కల్కి మళ్ళీ వాయిదా..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలాఆర్‌ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ప్రభాస్ మోకాలు నొప్పి ప్రాబ్లంతో విదేశాల్లో సర్జరీ చేయించుకుని వచ్చాడు. అయితే తాజాగా ఆ గాయం తిరగబడి మరల ఆపరేషన్ చేయించుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఏదైనా పాత్రను చేయడానికి ఓకే చెప్పాడంటే ఆ పాత్ర కోసం ఎంతైనా కష్టపడే హీరోలలో ప్రభాస్ మొదటివాడు. బాహుబలి సిరీస్ లో ఆయన ఎంతో కష్టపడి పనిచేసాడు. శివుడి పాత్రలో సన్నగా కనిపించే ప్రభాస్ బాహుబలి పాత్రలో మాత్రం భారీ పర్సనాలిటీతో సిక్స్ ప్యాక్ తో కనపడుతూ అందరిని ఆకట్టుకున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో గంటలు తరబడి జిమ్ లో కసరత్తులు చేసాడు. ప్రభాస్, రానాలను రాజమౌళి విపరీతంగా వాడుకున్నాడు. తను కోరుకున్న విధంగా వాళ్ళను మార్చే క్రమంలో ప్రభాస్ కు చాలా కష్టం కలిగిందట. యుద్ధ విద్యలో శిక్షణ కూడా తీసుకుంటున్న ప్రభాస్ ఆ సమయంలో మోకాలు నొప్పి సమస్యకు గురయ్యాడు. చాలా కాలంగా మోకాలు నొప్పితో బాధపడిన ప్రభాస్ వైద్యుల సలహా మేరకు గ తేడాది విదేశాల్లో సర్జరీ చేయించుకుని అక్కడే ఒక నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వచ్చాడు. సలార్‌ రిలీజ్ కు ముందు ఇండియాకు వచ్చిన ప్రభాస్ ఎటువంటి ప్రమోషన్స్ లోనూ పాల్గొనలేదు.

దీంతో ప్రభాస్ మోకాలు సమస్యతో బాధపడుతున్నాడని అందుకే ప్రమోషన్స్ కు రాలేదని వాదన వినిపించింది. ఇక ప్రస్తుత కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్ సినిమాల‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ మోకాలి గాయం మరోసారి తిరగబడిందని.. మరలా సర్జరీ అవసరమని తెలుస్తుంది. దీనికోసం రెబల్ స్టార్ విదేశాలకు వెళ్ళబోతున్నాడట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ప్రభాస్ సర్జరీ చేయించుకుని రావడానికి మరింత సమయం పడుతుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన కల్కి ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఈ వార్తలు నిజమైతే మరోసారి కల్కి వాయిదా పడే అవకాశం ఉంది.