“నన్ను క్షమించండి”.. ఫ్యాన్స్ కి నయనతార బహిరంగ క్షమాపణలు.. ఏమైందంటే..?

నయనతార .. సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్ . ఎన్ని సినిమాల్లో నటించిందో అన్ని సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా విజయశాంతి తర్వాత లేడీ టైగర్ అంటూ ట్యాగ్ చేయించుకున్న నయనతార జవాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది . ఆ తర్వాత అన్నపూర్ణ అంటూ ఒక స్పెషల్ కాన్సెప్ట్ తో సినిమాలో నటించచింది. ఈ సినిమా ను ఏ ముహుర్తాన స్టార్ట్ చేశారో కానీ అప్పటినుంచి అన్ని వివాదాలు మహారాష్ట్ర – మధ్యప్రదేశ్లలో అన్నపూర్ణ సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు మొదలయ్యాయి .

మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సైతం నయనతార సినిమా స్ట్రీమింగ్ నుంచి తొలగించింది . ఈ ఇష్యూ పెద్దది అయిపోవడంతో నయనతార ఎట్టకేలకు స్పందించింది . అన్నపూర్ణ సినిమాని ఏ వర్గానికి కించపరిచే ఉద్దేశంతో తెరకెక్కించలేదని ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ నిర్మాణ సంస్థ పేర్కొంది . అయినా ఈ సినిమాపై వ్యతిరేకత తగ్గలేదు తొలగలేదు దీంతో నయనతార ఓపెన్ గా స్పందించాల్సిన పరిస్థితి ఎదురయింది .

నయనతార తన చిత్రం అన్నపూర్ణి చుట్టూ ఉన్న వివాదంపై పశ్చాతాపం వ్యక్తం చేసింది. ఎవరి మనోభావాలనైన దెబ్బతీసి ఉన్న భావోద్వేగాలను కించపరిచి ఉన్నా దయచేసి క్షమించండి అంటూ నయనతార ఓపెన్ గా లేఖ రాసింది . ఆ లేఖను ఇంస్టాగ్రామ్ ద్వారా జై శ్రీరామ అంటూ హిందూ మత చిహ్నం ఓం అని రాసి క్షమాపణలు చెప్పింది . నయనతార పోస్టులో..” మేము పాజిటివ్ మెసేజ్ అందించడానికి చేసిన ఈ సినిమా ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి “అంటూ పోస్ట్ చేసింది . దీంతో సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ వైరల్ గా మారింది..!!