ఒకే ఒక్క హిట్ సినిమా.. ప్రభాస్, షారుక్ లను మించి పాపులారిటీ.. ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

సోషల్ మీడియా రంగంలోనే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(IMDb) కీలక పాత్ర పోషించే వెబ్సైట్ అని చాలామందికి తెలుసు. ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాలకు రివ్యూలు, రేటింగ్స్ ఇస్తూ అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న టాప్ 10 సెలెబ్రిటీల జాబితాను ప్రతివారం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ వెబ్సైట్. కాగా ఈ వారం జాబితాను కూడా ఐఎండిబి రిలీజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో ఈ డేటా రిలీజ్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.

ఈ డేటాలో ఎవ్వరు ఊహించని ఒక సెలబ్రిటీ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలే చేసినా.. వాటిలో ఒకటి మాత్రమే హిట్గా నిలిచింది. అయితే ఈ ఒక్క సినిమాతో ఏకంగా షారుక్ ఖాన్, ప్రభాస్, దీపిక పదుకొనే లాంటి పాన్ ఇండియన్ స్టార్ సెలబ్రిటీలకు మించి స్టార్ డంను అందుకుంది. ఇంతకీ ఈ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. మేధా శంకర్.

ఇటీవల 12th ఫెయిల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది. కాగా జనవరి 16న పూర్తయిన ఈ వారం అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో మేధా శంకర్ మొదటి స్థానాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ లిస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. షారుక్, ప్రభాస్ ల‌నే ఒకే ఒక్క హిట్ మూవీతో క్రాస్ చేసిందంటే ఇది సాధారణ విషయం కాదు అంటూ ఆమెపై నెట్టిజ‌న్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.