హీరోలతో బెడ్ రూమ్ సీన్స్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

టాలెంటెడ్ స్టార్ బ్యూటీ అంజలికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు దూరమైంది. కేవలం తమిళ సినిమాలో నటిస్తూ క్రేజ్‌ సంపాదించుకుంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. కాగా స్టార్ హీరోలతో బెడ్‌రూమ్‌ సీన్ల గురించి అంజలి చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అంజలి మాట్లాడుతూ సినిమాలో ముద్దు సన్నివేశాలు, పడకగది సన్నివేశాలు చాలా న్యాచురల్ గా తీస్తారు. కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా వాటిలో నటించాల్సి ఉంటుంది. మనం నో చెప్పడానికి కుదరదు.. కానీ హీరోలతో అలాంటి సన్నివేశాలు నటించేటప్పుడు ఎవరికైనా అన్ కంఫర్టబుల్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ లో నటిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనం, టెక్నీషియన్స్, మిగతా యాక్టర్స్ అంతా ఉంటారు

నా గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో.. అనే టెన్షన్, భ‌యం ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. అలా హీరోలతో కిస్సింగ్, బెడ్ రూమ్ సీన్స్ నాచురల్ గా నటించాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అంటూ అంజలి చెప్పుకొచ్చింది. ప్రస్తుత అంజలి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.