విష సాలీడు గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుందా.. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?

ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య గుండెపోటు. పెద్ద వారు, చిన్నవారిని తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు మెడిటేషన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వెంటనే ట్రీట్మెంట్ అంద‌కపోతే ఆ వ్యక్తులు చనిపోతున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాణాంతక సమస్యలు మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడిసిన్ భవిష్యత్తులో మన ముందు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

అది కూడా ఓ విషపు పురుగు సాలీడు నుంచి సేకరించే పాయిజ‌న్ ద్వారా తయారు చేసిన డ్రగ్స్ తో సాధ్యమవుతుందట. యూనివర్సిటీ ఆఫ్ క్విన్లాండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మాలిక్యులర్ బయోసైన్స్ కు చెందిన సైంటిస్టులు దీనిని చెబుతున్నారు. విషపురుగు నుంచి హార్ట్ ఎటాక్ రాకుండా ఆపే మెడిటేషనా.. అసలు ఏలా జరుగుతుంది అనుకుంటున్నారా.. ఆస్ట్రేలియా కే.. ఖరీ ద్వీపంలో ఎక్స్పరిమెంట్లు నిర్వహిస్తున్న సైంటిస్టులు అక్కడ ఓ ప్రాణాంతక ఫ్యునల్ వెబ్ స్పైడర్‌ను కనిపెట్టారు. దీనికి హైలా అని పేరు పెట్టారు. అయితే ఇదో విష పురుగు అని కనిపెట్టిన సైంటిస్టులు దీని విషయం ఎలా ప్రభావితం చేస్తుందో అని ప‌రిశోధ‌న‌లు మొద‌లు పెట్టారు.

ఎలుకలపై ఎన్నో రకాల ప్రయోగాలు నిర్వహించగా.. దీనిలో విష అణువులు.. గుండెపోటు, ఇస్కామిక్ స్ట్రోక్ సందర్భాల్లో ప్రాణాంతక కణాల నష్టాన్ని సమర్థవంతంగా ఆపుతోందని తెలుసుకున్నారు. ఆ తర్వాత క్లినికల్ ట్రైన్స్ లో భాగంగా పరిశోధకులు మనుషుల్లో గుండెపోటు సంభవించినప్పుడు కూడా హైలా సాలిడ్ విషపు అణువులను ప్రయోగించి చూశారు. అప్పుడు కూడా సెల్ డెత్ ను ప్రేరేపించి పరిస్థితులను హైలా ఆపివేసింది. అంతేకాకుండా ఇది మెదడులోని కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడగలదని కనుగొన్నారు. స్ట్రోక్ ఫలితంగా మెదడు దెబ్బతినడం స‌మ‌స్య కూడా తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫైనల్ స్టేజ్ ప్రయోగాల తర్వాత దీనిని వైద్య పరంగా ఉపయోగించవచ్చు అని సైంటిస్టులు వివరించారు.