బెంగళూరు పబ్ లో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రోజా.. ఏకీపారేస్తున్న నెటిజెన్లు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ రోజాకు ప్రత్యేకమైన పరిచయం అవ‌స‌రం లేదు. ప్రస్తుతం ఏపీ మినిస్టర్‌గా కొనసాగుతున్న ఈమె నిత్యం టిడిపి, జనసేన నేతలపై వీరుచకుపడుతూ వార్తల్లో సంచలనంగా నిలుస్తుంది. ఒకప్పుడు జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించిన రోజా.. మినిస్టర్ అయ్యాక పూర్తిగా రాజకీయాల్లోనే ఉండిపోయింది. ఇక రోజుకో వివాదం ఈమెకు అల‌వాటైపోయింది. ఎప్పటికప్పుడు ఎంతోమంది విమర్శలకు లోన‌య్యే రోజా.. తాజాగా మరోసారి వివాదంలో చెక్కుకుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బెంగళూరులో గ్రాండ్గా జరుపుకుంది.

TDP Talking About Values Is Like Devils Invoking Vedas: RK Roja | YSR  Congress Party

బెంగుళూరు లో కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్ సెలబ్రేషన్ చేసుకున్న ఈమె బెంగుళూర్ ప‌బ్‌లో పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో బ్లాక్ కలర్ డిజైన్ డ్రెస్సులు మెరిసింది రోజా. ఇక పబ్లో రోజా డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈమె పై నెటిజ‌న్స్ ఫైర్‌ అవుతున్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులు.. రోడ్డుపై నిరసనలు.. ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే.. మంత్రిగా నీకు ఏమీ పట్టవా..

బెంగళూరు పబ్బ్‌ లో చిందులు వేసుకుంటున్నావా.. నువ్వు అసలు మంత్రివే నా.. నీకు కాస్తైనా సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో భూమా అఖిలప్రియ నంద్యాల ఉపఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంతో తీవ్ర కామెంట్లు చేసిన రోజాపై విరుచుకుపడుతు.. ఇప్పుడు నువ్వే బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో పబ్ లో చిందులేస్తున్నావు.. ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏవి నీకు పట్టడం లేదు.. నువ్వు చేసేది మాత్రం తప్పు కాదు అంటూ తిట్టిపొస్తున్నారు. మరి దీనిపై రోజా ఎలా స్పందిస్తుందో చూడాలి.